టీమిండియా ఆల్ రౌండర్ విజయ్ శంకర్ నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన కాబోయే బార్య వైశాలి వీశ్వేశ్వరన్తో కలిసి దిన రెండు ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఉంగరం ఎమోజీని జత చేశారు. ఈ సందర్బంగా విజయ్‌కు అతని సహచరులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఇటీవల మరో క్రికెటర్ యుజువేంద్ర చాహల్ సైతం ధనశ్రీ వర్మతో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే.
విజయ్ పోస్టుపై స్పందించిన కేఎల్ రాహుల్, చాహల్ ‘అభినందలు సోదరా’.అంటూ శుభాకాంక్షలు తెలిపారు. కాగా విజయ్ శంకర్ 2018లో కొలంబోలో జరిగిన శ్రీలంక- భారత్ టీ 20 మ్యాచ్‌తో భారత జట్టుకు ఎంపికయ్యాడు. ఆ తర్వాత ఏడాదికి మెల్బోర్నోలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆడి వన్డేలో అరంగేట్రం చేశాడు. శంకర్ భారత్ తరఫున ఇప్పటి వరకు 12 వన్డేలు, తొమ్మిది టీ 20లు ఆడాడు. త్వరలో యూఏఈలో జరిగే ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడనున్నాడు. కరోనా వైరస్ నేపథ్యంలో వాయిదా పడిన ఐపీఎల్ సెప్టెంబర్ 19వ తేదీ నుంచి యూఏఈలో జరుగనున్న సంగతి తెలిసిందే.