Crime: హాస్టల్లో అగ్ని ప్రమాదం.. 13 మంది విద్యార్థుల మృతి

Crime: Wife sets her husband on fire for not buying ear plugs..!
Crime: Wife sets her husband on fire for not buying ear plugs..!

చైనాలో శుక్రవారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ పాఠశాల వసతి గృహంలో జరిగిన ఈ ఘటనలో 13 మంది విద్యార్థులు మృతి చెందారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. హెనాన్ ప్రావిన్స్లోని యింగ్కాయ్ పాఠశాల వసతి గృహంలో రాత్రి 11 గంటలకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 13 మంది చిన్నారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని చర్యలు చేపట్టారు.

గాయపడిన విద్యార్థి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతులందరూ మూడో తరగతి చదువుతున్న విద్యార్థులని పాఠశాల ఉపాధ్యాయుడు మీడియాకు వెల్లడించారు.