హిట్ అండ్ రన్ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు జూబ్లీహిల్స్ ఏసీపీ హరిప్రసాద్ తెలిపారు. A1గా కొవ్వూరి రిత్విక్‌రెడ్డి, వైష్ణవి (A2), పొలుసాని లోకేశ్వ ర్రావు (A3), బుల్లా అభిలాష్ (A4), A5గా అనికేత్‌ను పేర్కొన్నట్లు చెప్పారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ కేసు వివరాలను వెల్లడించారు. ‘‘హిట్ అండ్ రన్ కేసులో తారక్‌రామ్ అక్కడికక్కడే మృతిచెందారు. ఏసు రాజుకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులు పట్టుకుంటారనే భయంతో రిత్విక్‌రెడ్డి పరారయ్యాడు. స్నేహితుడు సురేష్‌రెడ్డి ఇంట్లో కారును దాచిపెట్టారు. రిత్విక్ అమెజాన్‌లో జాబ్ చేస్తున్నాడు. ఆఫీస్ చూపిస్తానని స్నేహితులను తీసుకెళ్లాడు. మద్యం మత్తులో అతడు కారు నడిపినట్లు దర్యా ప్తులో తేలింది. అందులో ప్రయాణించిన వారిని కూడా నిందితులుగా చేర్చాం. రిత్విక్రెడ్డిపై సెక్షన్ 304(2) కింద.. మిగిలిన వారిపై 337 ఐపీసీ, 337, 187 ఎంవీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశాం’’ అని ఏసీపీ వివరించారు.