Crime: చింత చచ్చిన పులుపు చావనట్టు.. 23 ఏళ్ల యువతితో 53 ఏళ్ల ASI రాసలీలలు..

Crime: 53-year-old ASI Rasalilalu with a 23-year-old girl.
Crime: 53-year-old ASI Rasalilalu with a 23-year-old girl.

23 ఏళ్ల యువతితో 53 ఏళ్ల ASI రాసలీలలకు పాల్పడిన సంఘటన ఇప్పుడు హాట్‌ టాపిక్‌ గా మారింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల ఇబ్రహీంపట్నం మండలంలోని వర్షకొండ గ్రామానికి చెందిన యువతి కొద్ది రోజుల కిందట భర్త త్రాగి వచ్చి కొడుతున్నాడని న్యాయం చేయాలని ఇబ్రహీంపట్నం పోలీస్ట్రేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ASI రాములు తన భర్తను పిలిపించి కౌన్సిలింగ్ చేశాడు.

అయినా భర్త మారకపోవడంతో తరచూ గొడవలు జరిగేవి తరచూ యువతి పోలీస్ స్టేషన్ కు రావడంతో ఆ యువతిపై ASI కన్నేశాడు. విచారణ పేరుతో ఆమెను ట్రాప్‌లోకి దింపాడు. తరచూ ఫోన్‌లో మాట్లాడుతూ ఆమెకు దగ్గరయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న SI మెట్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా ఏఎస్ఐను మందలించడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవద్దని త్వరలో రిటైర్మెంట్ ఉందని తన పద్దతి మార్చుకుంటానని కాళ్లు మొక్కినట్లు సమచారం. అయితే ఆ ASI సదరు యువతితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.