Crime: వివాహితతో పారిపోయిన ఓ వ్యక్తిని కొట్టి, మూత్రం తాగించి ఘటన

Crime: A man who ran away with a married woman was beaten and made to drink urine
Crime: A man who ran away with a married woman was beaten and made to drink urine

మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లాలో వివాహితతో పారిపోయిన ఓ వ్యక్తిని కొందరు వ్యక్తులు కొట్టి, బలవంతంగా మూత్రం తాగించి, మెడలో చెప్పల దండ వేసి.. చిత్రహింసలకు గురిచేశారు. ఈ అమానవీయ ఘటన వీడియోలు ఇంటర్నెట్లో విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. బాధితుడు చెప్పుల దండ ధరించి, మూత్రాన్ని తాగుతున్నట్లు ఓ వీడియోలో ఉంది.

వివాహిత అతనిని కొట్టినట్లు కూడా రికార్డయింది. సగం మీసం, అరగుండుతో ఉన్న బాధితుడు ఒక బూటును నాకుతూ.. మరో బూటును తలపై పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. బాధితుడి నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని, వీడియోల్లో ఉన్న వివరాల ప్రకారం బాధితుడిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.