Crime: తన ప్రేమను తిరస్కరించిన అధ్యాపకుడిపై కక్ష..

Crime: Action against the teacher who rejected his love.
Crime: Action against the teacher who rejected his love.

తన ప్రేమను తిరస్కరించిన అధ్యా పకుడిపై కక్షగట్టిన యువతి, ఆయన 11 ఏళ్ల కుమార్తె పరువు తీసేందుకు తెగించింది. చివరికి కటకటాల పాలైంది. హైదరాబాద్ నగర సీసీఎస్ జాయింట్ కమిషనర్ ఏవీ రంగనాథ్, డీసీపీ కవిత, ఏసీపీ చాంద్బాషాలు గురువారం కేసు వివరాలు వెల్లడించారు.ఏపీలోని అనంతపురం జిల్లా రాయదుర్గం ప్రాంతానికి చెందిన యువతి(24) గ్రూప్-1 శిక్షణ కోసం హైదరాబాద్కు వచ్చింది. అశోక్నగర్లోని ఓ శిక్షణ సంస్థలో చేరిన ఆమె, అక్కడ ఓ సబ్జెక్టు బోధించే అధ్యాపకుడిపై మనసు పడింది. తాను ప్రేమిస్తున్న విషయాన్ని అధ్యా పకుడికి చెప్ప గా.. తనకు భార్యా పిల్లలున్నారని చెబుతూ మందలించారు.

ఆయనపై పగ పెంచుకున్న యువతి అధ్యా పకుడి భార్య, కుమార్తె ఫొటోలు సేకరించింది. ఇన్స్టాగ్రామ్లో నకిలీ ఖాతా, యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి అధ్యాపకుడి కుటుంబ చిత్రాలతోపాటు 11 ఏళ్ల ఆయన కుమార్తె ఫొటోలు మార్ఫింగ్ చేసి అప్లోడ్ చేసింది. అధ్యాపకుడు పనిచేసే శిక్షణ సంస్థ, హైకోర్టు అధికారిక పేజీలు, విద్యార్థుల వాట్సప్ గ్రూపుల్లోనూ అశ్లీలతతో కూడిన పదజాలంతో ఆయా పోస్టులు పెడుతూ వేధింపులకు గురిచేస్తూ వచ్చింది. ‘బాధితుడి ఫిర్యాదు మేరకు నగర సైబర్క్రైమ్ ఇన్స్పెక్టర్ సైదులు బృందం సాంకేతిక ఆధారాలతో నిందితురాలిని అనంతపురంలో గురువారం అరెస్టు చేసింది. నిందితురాలిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండుకు తరలించాం ’ అని నగర సైబర్ క్రైమ్ పోలీసులు వివరించారు.