కుటుంబ సమస్యలతో ఏఆర్ కానిస్టేబుల్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం ధర్మాపురంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మాపురం గ్రామానికి చెందిన అర్రూరి సైదులు (45) జిల్లా కేంద్రంలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కుటుంబంతో అక్కడే మూడేళ్లుగా నివాసముంటున్నాడు. మంగళవారం స్వగ్రామం ధర్మాపురం శివారులో పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి విచారణ చేపట్టారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆర్థిక సమస్యలతో కుటుంబంలో జరిగిన గొడవల కారణంగానే సైదులు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.