హ్యాపీ హోమ్(శామీర్‌పేట్) తదితర ప్రాజెక్టుల్లో ‘ప్రీ-లాంచ్’ పేరుతో సుమారు 300 మంది నుంచి డిపాజిట్ల రూపంలో సుమారు రూ.80కోట్ల వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్న భువం తేజ్ ఇన్ఫ్రా ప్రాజెక్టు లిమిటెడ్‌కు చెందిన ఇద్దరిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వారి కథనం ప్రకారం ..
జూబ్లీహిల్స్ , మాన్షన్ అపార్ట్మెంట్స్లోని ఫ్లాట్ నంబరు 301లో ఉండే జెర్రిపోతుల ఫణి భూషణ్‌రావు(50), రాజ్‌కుమార్(27) భువం తేజ్ ఇన్ఫ్రా సంస్థను ఏర్పాటు చేసి అమాయకుల నుంచి రూ.80 కోట్ల వరకు దండుకున్నారు. ప్రాజెక్టు పూర్తి చేయకపోగా.. డబ్బులు తిరిగి చెల్లించకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులిద్దరిని రిమాండ్‌కు తరలించారు