Crime: T- shirt కోసం గొడవ.. తమ్ముడి చేతిలో అన్న మృతి

Crime: Atrocious in Pragathinagar.. Selfie video viral on Champi's Instagram
Crime: Atrocious in Pragathinagar.. Selfie video viral on Champi's Instagram

టీ షర్ట్ కోసం జరిగిన ఘర్షణలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సంతబొమ్మాళి మండలం కాకరాపల్లికి చెందిన రమేశ్, సురేశ్ అన్నదమ్ములు గురువారం రాత్రి రమేశ్ టీ షర్ట్ను సురేశ్ ధరించాడు. దీంతో వారి మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది.

ఈ క్రమంలో అన్న రమేశ్ ను తమ్ముడు సురేశ్ నెట్టివేయడంతో తలకు రాయి తగిలింది. తీవ్ర గాయం కావడంతో స్థానికులు శ్రీకాకుళంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం రమేశ్ మృతిచెందినట్లు ఎస్సై సిద్ధార్థ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.