ప్రవేశ పరీక్షల శిక్షణ సంస్థలకు నెలవైన రాజస్థాన్‌లోని కోటా పట్టణంలో ఓ మైనర్‌పై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు అయిన విద్యార్థిని శిక్షణ కోసం కొంతకాలం క్రితం కోటాకు వచ్చింది. అక్కడ సామాజిక మాధ్యమాల ద్వారా ఓ విద్యార్థితో పరిచయం ఏర్పడింది.
ఈ క్రమంలో అతడు నివసిస్తున్న ఫ్లాట్‌కు ఈ నెల 10న వెళ్లింది. ఆ సమయంలో అతడి నలుగురు స్నేహితులు అక్కడ ఉన్నారు. వారు తనపై అత్యాచారం చేసినట్లు బాధితురాలు 13న ఫిర్యాదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.