నగరంలోని ప్రతిమ మల్టీప్లెక్స్‌లో పోలీసులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో రూ.6.65 కోట్లు పట్టుబడ్డాయి. హోటల్, బార్ అండ్ రెస్టారంట్, సినిమా హాళ్లలో సోదాలు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి 1.30 గంటల నుంచి శనివారం ఉదయం వరకు తనిఖీలు కొనసాగాయి. స్వాధీనం చేసుకున్న డబ్బును కోర్టులో డిపాజిట్ చేయనున్నట్లు ఏసీపీ నరేందర్ తెలిపారు.