Crime: మరికొన్ని గంటల్లో పెళ్లి… తండ్రి చేతిలో వరుడి మృతి

Crime: Marriage in a few hours... Groom's death at the hands of his father
Crime: Marriage in a few hours... Groom's death at the hands of his father

పెళ్లిసందడితో ఉన్న ఆ కుటుంబంలో ఒక్క సారిగా విషాదం అలముకుంది. గౌరవ్ సింఘాల్ (29) అనే యువకుడు దక్షిణ దిల్లీలో జిమ్ నడుపుతున్నాడు. గురువారం అతడి వివాహం జరిగేలా నిశ్చయించారు. మరికొన్ని గంటల్లో పెళ్లి అనగా.. నిత్యం తనతో గొడవపడుతూ బుధవారం రాత్రి చేయి కూడా చేసుకున్నాడనే కోపంతో తండ్రి రంగలాల్ సింఘాల్ కుమారుడిని 15 సార్లు కత్తితో పొడిచి హత్య చేశాడు. సంగీత వాయిద్యాల చప్పుడు ఎక్కువగా ఉండటంతో ఈ విషయాన్ని ఎవరూ వెంటనే గుర్తించలేకపోయారు.

వివాహ ఊరేగింపు కోసం వరుణ్ని వెదుకుతున్న బంధువులకు రక్తపుమడుగులో అతడు కనిపించడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గౌరవ్ మరణించాడు. గాలింపు చర్యల అనంతరం గురువారం రాత్రి నిందితుడిని అదుపులోకి తీసుకొన్నట్లు డీసీపీ అంకిత్ చౌహాన్ తెలిపారు. ఇంటి నుంచి అతడు పట్టుకుపోయిన రూ.50 లక్షల ఆభరణాలు, రూ.15 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.