ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో దారుణం చోటుచేసుకుంది. ఫోన్ కోసం జరిగిన గొడవలో ఓ మహిళ తన భర్తపై కత్తెరతో దాడి చేసి కంటిలో పొడిచింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడు అంకిత్ యూట్యూబ్‌లో పాటలు చూడటానికి మొబైల్ ఫోన్ ఇవ్వాలని తన భార్య ప్రియాంకను అడగగా, అందుకు ఆమె తిరస్కరించింది. తన ఫోన్లోనే చూడమంటూ చెప్పింది. దీనిపై ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కోపోద్రిక్తురాలైన ప్రియాంక కత్తెరతో అంకిత్ కంటిలో పొడిచింది. బాధితుడు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.