Crime: ఒకే యువకుడితో రిలేషన్‌.. యువతిని చంపిన ట్రాన్స్‌ జెండర్‌..!

Crime: Relationship with a single young man.. The transgender who killed the young woman..!
Crime: Relationship with a single young man.. The transgender who killed the young woman..!

ఒకే యువకుడితో రిలేషన్‌..యువతిని ఓ ట్రాన్స్‌ జెండర్‌ చంపాడు. ఒకే యువకుడిని అమ్మాయి, అబ్బాయి ప్రేమించారు. కానీ చివరికి అమ్మాయి సజీవదహనం అయింది. ఈ సంఘటన చెన్నైలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని నందిని(25), వెట్రి మణిమారనన్ను ప్రేమించుకున్నారు.

తర్వాత అతడు ట్రాన్స్ జెండర్ అని తెలియడంతో అతన్ని వదిలేసి రాహుల్ అనే యువకుడితో ప్రేమలో పడింది. అయితే రాహుల్‌ను మణిమారన్ కూడా ప్రేమిస్తున్నట్లు తెలుసుకున్న నందిని అతడిని మందలించింది. మణిమారన్ కోపంతో ఆమె పుట్టినరోజున(శనివారం) ఓ చెరువు వద్దకు తీసుకెళ్లి కాళ్లు, చేతులు కట్టేసి సజీవదహనం చేశాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.