Crime: మత్తుమందులు అమ్మి రూ.23 కోట్ల ఆస్తుల ఆర్జన..!

Crime: Rs. 23 Crore property earned by selling narcotics..!
Crime: Rs. 23 Crore property earned by selling narcotics..!

నిషేధిత ఆల్ప్రాజోలం అమ్ముతూ ఆర్జించిన ఇద్దరు నిందితులకు చెందిన రూ.23 కోట్ల విలువైన ఆస్తులను తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కొటిక్స్ బ్యూరో అధికారులతో కలిసి షాద్నగర్ పోలీసులు జప్తు చేశారు. మత్తుమందుల కేసులో ఇంత పెద్దమొత్తంలో నిందితుల ఆస్తులు జప్తు చేయడం ఇదే ప్రథమం . ఈ మేరకు టీఎస్న్యాబ్ సంచాలకుడు సందీప్ శాండిల్య బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆబ్కారీ శాఖలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న కామారెడ్డి జిల్లాకు చెందిన రమేశ్, రంగారెడ్డి జిల్లా షాబాద్కు చెందిన గుండుమల్ల వెంకటయ్యలు 2 కిలోల ఆల్ప్రాజోలం అమ్ముతుండగా గత ఏడాది డిసెంబరు 25న టీఎస్న్యా బ్ అధికారులతో కలిసి షాద్నగర్ పోలీసులు పట్టుకొని మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. మత్తుమందుల ద్వారా కూడబెట్టుకున్న ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఈ చట్టంలో వెసులుబాటు ఉంది.

దాంతో ఇద్దరు నిందితులు ఆల్ప్రాజోలం అమ్మడం ద్వారా కూడబెట్టిన ఆస్తుల వివరాలను పోలీసులు సేకరించారు వీరిద్దరికీ మొత్తం రూ.23 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు ఉన్నట్లు గుర్తించి వాటిని జప్తు చేశారు. వెంకటయ్యకు షాద్నగర్లో 866.66 గజాల నాలుగు ఓపెన్ ప్లాట్లు, షాద్నగర్ మండలంలో 21.28 ఎకరాల వ్య వసాయ భూమి, షాబాద్ మండలంలో 13.04 ఎకరాల వ్యవసాయ భూమి, తన భార్య పేరుమీద కొన్న 2.22 ఎకరాల భూమి, షాద్నగర్లోని ఎస్బీ ఐలో మూడు ఖాతాల్లో రూ.4,24,990 నగదు ఉన్నాయి. రమేశ్కు ఒక మారుతి స్వి ఫ్ట్ కారు, కామారెడ్డిలోని ఎస్బీఐలోని రెండు ఖాతాల్లో రూ.2,21,191 నగదు ఉన్నాయి. మాదకద్రవ్యాలకు సంబంధించి సమాచారం ఉంటే 8712671111 నంబరుకు లేదా tsnabho-hyd@tspolice.gov.in (mailto:tsnabhohyd@tspolice.gov.in)కు సమాచారం ఇవ్వాలని సందీప్ శాండిల్య విజ్ఞప్తి చేశారు.