భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పరిధి గుండ్లరేవుకు చెందిన భూక్య మహేష్‌తో అదే జిల్లా పాల్వంచ మండలం కరకవాగుకు చెందిన లతతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. మహేష్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఇటీవల మహేష్ రెండు సార్లు పక్షవాతం వచ్చింది. దంపతులు ఆరు నెలల కిందటే కేపీహెచ్‌బీ హైదర్‌నగర్ పరిధిలోని రాంనరేష్ నగర్‌కు మారారు. విక్రమ్ అనే మరో క్యాబ్ డ్రైవర్ మహేష్ స్నేహితుడు. మహేష్ వీరి మధ్య ఉన్న స్నేహం కారణంగా రెండు సార్లు విక్రమ్‌ని ఇంటికి తీసుకొచ్చాడు. ఈ క్రమంలో లతపై విక్రమ్ కన్నేశాడు.
విక్రమ్ చాలాసార్లు మహేష్ లేని సమయంలో ఇంటికి రావడంతో ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. దీంతో మహేష్ అడ్డు తొలగించుకోవాలని భావించాడు. ఈ ఏడాది జూన్ 22న మహేష్ కుర్చీలో కూర్చోబెట్టి ఉరివేశారు. ఆ వెంటనే మూర్ఛవల్లే తన భర్త చనిపోయాడని భార్య లత చుట్టుపక్కల వున్న వారిని నమ్మించింది. అదే ఆమెకు దొరికిపోయేలా చేసింది.ఇంటి యజమాని దగ్గర్లోని డాక్టర్‌కి ఫోన్ చేయగా, మహేష్ పల్స్ ఇంకా కొట్టుకోవడంతో వెంటనే గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ జూన్ 23న మహేష్ మృతి చెందాడు. గొంతుపై గాయం ఉండడం తో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఈ మేరకు మృతుడి సోదరుడు ఫిర్యాదు చేశాడు. పోస్టుమార్టం రిపోర్టు రాగానే మహేశ్‌ది హత్య అని నిర్ధారణ అయింది. దీంతో పోలీసులు లత(23)ని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకుంది. ఆమె అసలు విషయం చెప్పింది. ప్రియుడు విక్రమ్‌తో కలిసి హత్య చేసినట్లు ఆమె అంగీకరించింది. అయితే లత ప్రియుడు విక్రమ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.