ఏపీలో దారుణం జరిగింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను చంపారు భార్య, ప్రియుడు. ఈ సంఘటన అన్నమయ్య జిల్లా జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను చంపింది ఓ భార్య. దీనికి అమె ప్రియుడు, సొంత తండ్రి సహాయం చేశారు.
తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని శ్రీనివాసులను హత్య చేసిన భార్య గీతమ్మ, ఆమె ప్రియుడు ప్రసాద్, తండ్రి రామస్వామిని ఈ నేపథ్యంలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. అటు శ్రీనివాసులు మృతదేహం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని తండ్రి రామస్వామి సహాయంతో పూడ్చి పెట్టారు నిందితులు.
బాధితుడి కుటుంబీకుల ఫిర్యాదుతో అదృశ్యం కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణలో గీతమ్మ, ఆమె ప్రియుడు ప్రసాద్, తండ్రి రామస్వామిని అరెస్ట్ చేశారు. నిందితుల ముగ్గురిని అరెస్టు చేసి మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహణ చేశారు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.