Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నా పేరు సూర్య’. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ చిత్రం విడుదలకు ఇంకో మూడు నెలలు ఉండగానే పబ్లిసిటీ భారీగా చేస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ ఇంపాక్ట్ వీడియో అంటూ విడుదల చేసి అందరి దృష్టిని ఆకర్షించిన చిత్ర యూనిట్ సభ్యులు తాజాగా రిపబ్లిక్ డే సందర్బంగా సైనికుల గొప్పదనం గురించిన ఒక పాటను విడుదల చేయడం జరిగింది. సైనికులు దేశాన్ని ఎలా కాపాడుతున్నారు అనే విషయాన్ని ఆ పాటలో రామజోగయ్య శాస్త్రీ అద్బుతంగా చెప్పాడు. చిత్ర యూనిట్ సభ్యులు ఈ పాటను చిత్రానికి హైలైట్‌గా ఉంటుందని చెబుతున్నారు. ఈ పాటను రిపబ్లిక్ డే సందర్బంగా విడుదల చేయడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు.
ఒకటికి రెండు సార్లు పాట వింటే బాగుందని అనిపిస్తుంది. మెగా ఫ్యాన్స్‌కు ఈ పాట ఎక్కేస్తోంది. అయితే విశ్లేషణాత్మకంగా పాటను విన్న వారికి మాత్రం ఒక లోటు కనిపిస్తుంది. సైనిక పాట లిరిక్స్‌ను ట్యూన్ డామినేట్ చేస్తోంది. ట్యూన్ కాస్త తగ్గించి ఉంటే బాగుండేదని, శ్రద్ద పెట్టి వింటే తప్ప లిరిక్స్ అర్థం కావడం లేదు. ఇలాంటి లిరిక్స్ ప్రధానమైన పాటల ట్యూన్ ఎంత తక్కువగా ఉంటే అంతగా ప్రేక్షకులు లిరిక్స్‌ను గుర్తు పెట్టుకుంటారు.
శాస్త్రి రాసిన సాహిత్యం ఆకట్టుకునే విధంగా ఉంది. అయితే ట్యూన్ ఆ సాహిత్యంను డామినేట్ చేయడంతో పాట అంతగా గుర్తుంచుకునే విధంగా లేదనే టాక్ వినిపిస్తుంది. విశాల్, శేఖర్లు ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్న విషయం తెల్సిందే. వీరిద్దరు మొదటి సారి ఒక తెలుగు సినిమాకు పని చేస్తున్నారు. ఈ పాట గుణపాఠం అయ్యి వారు మిగిలిన పాటలను అయినా చక్కగా ట్యూన్ చేయాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆడియో విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందని బన్నీకి సినీ ప్రముఖులు కూడా సలహా ఇస్తున్నారు.