విడుదలైన అన్ని భాషల్లో జైలర్ సక్సెస్ కావడంతో సినిమా నిర్మాత రజినీకాంత్ కి మరో వంద కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చారని సమాచారం.
రజినీకాంత్ జైలర్ తో హిస్టారిక్ హిట్ అని నమోదు చేశాడు. ఈ సినిమా ఏకంగా రూ. 650 కోట్ల మార్క్ చేరుకుంది. తెలుగు, తమిళ, హిందీతో పాటు అన్ని భాషల్లో వసూళ్ల వర్షం కురిపించింది. జైలర్ తెలుగు హక్కులు కేవలం రూ. 12 కోట్లకు కొనుగోలు చేశారు. రూ. 75 కోట్ల గ్రాస్ రాబట్టింది. జైలర్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 122 కోట్లని సమాచారం. ఆ లెక్కన ఎంతటి లాభాలు పంచిందో అర్థం చేసుకోవచ్చు. జైలర్ ట్రెమండస్ సక్సెస్ నేపథ్యంలో సినిమా నిర్మాత కళానిధి మారన్ రజినీకాంత్ ని కలిశారు.
రజినీకాంత్ కి కళానిధి మారన్ చెక్ అందజేశాడు. ఇది వంద కోట్ల చెక్ అని సమాచారం. జైలర్ పెద్ద మొత్తంలో లాభాలు పంచగా మరో వంద కోట్లు అదనంగా రజినీకాంత్ కి ఇచ్చాదంట . ఆల్రెడీ రజినీకాంత్ రూ. 110 కోట్లు తీసుకున్నారంట . ఈ వంద కోట్లతో కలిపి మొత్తం రూ. 210 కోట్లు జైలర్ సినిమాకు తీసుకున్నట్లు అయ్యిందని టాక్.
దీంతో ప్రభాస్ ని దాటేశాడు రజినీకాంత్. ప్రభాస్ సినిమాకు రూ. 150 కోట్లు తీసుకుంటూ దేశంలోనే హైయెస్ట్ పెయిడ్ హీరోగా తెరకెక్కాడు . ఇప్పుడు రెండు వందల కోట్లు తీసుకుని రజనీకాంత్ రికార్డు బద్దలుకొట్టేసాడు .
జైలర్ (jailer)చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. రజినీకాంత్ రిటైర్డ్ జైలర్ ఉద్యోగిగా కనిపించారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. ఆయన మ్యూజిక్ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ గెస్ట్ రోల్స్ చేశారు. తమన్నా, రమ్యకృష్ణ, సునీల్ కీలక పాత్రల్లో కనిపించారు.