డిసెంబర్‌ 1 నుంచి డిల్లీలో కర్ఫ్యూ

డిసెంబర్‌ 1 నుంచి డిల్లీలో కర్ఫ్యూ

కరోనా వైరస్‌ ఉదృతి తగ్గడం లేదు. పైగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోవిడ్ సెకండ్‌ వేవ్‌ ప్రారంభమయ్యింది. మన దేశంలో కూడా కరోనా మరోసారి విజృంభించనుందని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ సూచించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ కోవిడ్‌ కట్టడి కోసం కర్ఫ్యూని విధించనున్నట్లు తెలిపారు.

డిసెంబర్‌ 1 నుంచి రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లోకి రానున్నట్లు సీఎం అమరీందర్‌ సింగ్‌ బుధవారం తెలిపారు. ఇక కోవిడ్‌ నిమయాలను అతిక్రమించే వారికి విధించే జరిమానాలను కూడా రెట్టింపు చేయనున్నట్లు తెలిపారు. ప్రొటోకాల్‌ పాటించని వారికి 1000 రూపాయల జరిమానా విధించనున్నట్లు వెల్లడించారు.

అంతేకాక రెస్టారెంట్లు, హోటల్స్‌, వివాహాది వేడుకలు వంటివి రాత్రి 9.30 గంటలలోపు ముగించాలని ఆదేశించారు. డిసెంబరు 15 తర్వాత వీటిని సమీక్షిస్తామని తెలిపారు. ఇక ఇప్పటి వరకు పంజాబ్‌లో 1,47,655 కేసులు ఉండగా.. 1,36,000 మంది కోలుకున్నారు. 6,834 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇక ఇప్పటివరకు పంజాబ్‌లో కోవిడ్‌ బారిన పడి 4,653 మంది మరణించారు.