వినూత్న రీతిలో సైబర్ నేరగాళ్లు తెగింపు….

సమాజంలో సైబర్ నేరగాళ్ల చేష్టలు పెచ్చుమీరాయి. శాంసంగ్ గేలాక్సీ, గేలాక్సీ ఎస్ 10, యాపిల్, మైక్రోమ్యాక్స్, మాక్ బుక్, ల్యాప్ టాప్ లు, వన్ ప్లస్ వంటి ఫోన్లు చాలా తక్కువ ధరకు ఇస్తామని చెప్తున్నారు. వినియోగదారులకు ఆన్ లైన్ లో సరికొత్త ఆఫర్లను ఎర వేసి నేరాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. బలహీనతలను సొమ్ముచేసుకొని అక్రమాలకు పాల్పడుతున్నారు. ఆన్ లైన్ లో ఇలాంటి ప్రకటనలు చూసి ఆశపడే వారిని సైబర్ నేరగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. తక్కువ ధరలకు వస్తుందనే ఆశ వారికి పెట్టుబడిగా ఆన్ లైన్ మోసాలకు తెగబడుతున్నారు.

అయితే మార్కెట్ లో లక్ష రూపాయలు అమ్మే ఫోన్ కేవలం రూ. 5 వేలు లేదా రూ.10వేలకే వస్తుందంటూ ఎరవేస్తున్నారు.  అయితే కొంతమంది ఇది ఎలా సాధ్యంమని.. ఇది మోసమని గ్రహించి లైట్ తీసుకుంటారు. మరికొంతమంది మాత్రం ఆశతో ఆన్ లైన్లో మోసగాళ్ల చేతిలో మోసానికి గురౌతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. తక్కువ ధరకే ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులు అంటూ ప్రచారం చేసి ఆశపడిన వారితో ముందుగా కొంత డబ్బు అడ్వాన్స్‌గా చెల్లించాలని చెప్పేవారు. అడ్వాన్స్‌ వచ్చిన తర్వాత నకిలీ ఇన్‌వాయిస్‌ చూపించి, సరుకును కొరియర్‌లో పంపామని మిగతా సొమ్ము చెల్లించాలని చెప్పి మిగతా డబ్బును వేర్వేరు అకౌంట్‌లలో జమచేయించుకొనేవారు. అలా తర్వాత కొరియర్‌ బాయ్‌లా ఫోన్‌చేసి పార్సిల్‌ను కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారని.. జీఎస్టీ వంటి ఫీజులు చెల్లించాలని చెప్పి మరికొంత డబ్బులాగేసేవారు.

ఇలా అంచలంచలుగా డబ్బు గుంజిసేవాళ్లు. ఇలా సైబర్ నేరగాళ్లు ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి ఆన్ లైన్ డెలివరీ సంస్థల సైట్స్ ని కూడా హ్యాక్ చేస్తున్నారు. ఫేస్ బుక్, వాట్సప్, ట్విట్టర్ లలో ఫ్లిప్ కార్ట్, అమెజాన్ పేరుతో 90శాతానికి పైగా ఆపర్లు పెట్టాయి అని చూపిస్తారు. దానిపై క్లిక్ చేస్తే నిజంగానే సైట్ ఓఫైన్ అవుతుంది. అక్కడ కూడా 90శాతం తగ్గింపు ఆఫర్లు చూపిస్తాయి. అయితే ఇక్కడే అసలు రహస్యముంటుంది. పెద్ద సంస్థలకు క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం స్పాట్ క్యాష్ అంటే.. డిజిటల్ ట్రాన్స్ ఫర్లే వుంటాయి. గూగుల్ పే, ఫోన్ పే అకౌంట్స్ లో చెల్లించాలి. మీరు ఒకసారి చెల్లిస్తే అంతే సంగతులు. వాటిపైన ఆశలు వదులుకోవాల్సిందే. పోయాం మోసం అని గ్రహించాల్సిందే.