సైబర్ నేరగాళ్లు మరోసారి భారీగా పంజా విసిరారు. ఇన్వెస్ట్మెంట్ పేరుతో సోమవారం ఒక్కరోజే నగర వ్యాప్తంగా ఏడుగురు వ్యక్తులకు ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో వల వేసి భారీ మొత్తంలో కాజేశారు. సైదాబాద్‌కు చెందిన యువకుడిని ఆన్లైన్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి రూ.9లక్షలు మోసం చేశారు. అదే తరహాలో అఫ్జల్‌గంజ్‌కు చెందిన మరో వ్యక్తికి టోకరా వేసి రూ.6.44 లక్షలు కాజేశారు.
మోతీనగర్ వాసి నుంచి రూ.1.48లక్షలు, వెస్ట్‌మారేడ్‌పల్లి వాసి నుంచి రూ.3.49లక్షలు, లాల్‌దర్వాజ వాసి నుంచి రూ.1.40లక్షలు, మలక్‌పేట వాసి నుంచి రూ.1.88లక్షలు, లాటరీ పేరుతో చారి్మనర్ వాసి నుంచి రూ.1.18లక్షలు స్వాహా చేశారు. ఇలా 8మంది నుంచి రూ.27.06లక్షలు లూటీ చేశారు. బాధితులు సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.