అమిత్ షాతో టీఆర్ఎస్ ఎంపీ రహస్య మంతనాలు

d srinivas met amith shah

మొన్న టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరై ఆ పార్టీ నాయకత్వానికి షాక్ ఇచ్చిన రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ నిన్న కేంద్రమంత్రి, బీజేపీ చీఫ్ అమిత్ షాను కలిసి రహస్య మంతనాలు జరిపి మరోమారు వార్తల్లోకి ఎక్కారు. అమిత్ షాను డీఎస్ కలిసిన విషయాన్ని టీఆర్ఎస్ ఎంపీలు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో డీఎస్ వ్యవహారాన్ని అధిష్ఠానం తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ ఫిరాయింపునకు సంబంధించిన ఏ ఒక్క ఆధారం దొరికీన ఆయన మీద అనర్హత వేటు వేసే అవకాశం కోసం రాజ్యసభ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేయాలని భావిస్తోంది. బుధవారం టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరైన డీఎస్ నిన్న అమిత్ షాను కలవడం వెనక ఏదైనా వ్యూహం ఉండే అవకాశం ఉందని టీఆర్ఎస్ నేతలు అనుమానిస్తున్నారు. తెలంగాణా మీద ఫోకస్ చేసిన అమిత్ షా ఏదైనా ప్లాన్ చేశారా ? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే ఏదో ప్లాన్ ప్రకారమే డీఎస్ ఇలా చేస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా నేతలు తాజాగా పార్టీ అధిష్ఠానాన్ని కోరారు. కాగా, అమిత్ షాను డీఎస్ ఓ ఎంపీ హోదాలో కలిశారని, అంతేతప్ప రాజకీయంగా ఈ సమావేశానికి ఎటువంటి ప్రాధాన్యం లేదని డీఎస్ సన్నిహిత వర్గాలు చేబుతున్నాయు. గత అసంబ్లీ ఎన్నికల ముందు ఆయన మీద నిజామాబాద్ నేతలు కేసీఆర్ కి ఫిర్యాదు చేశారు. అప్పటి నుండి ఆయనకీ పార్టీలో గౌరవం తగ్గింది. అయన కాంగ్రెస్ లోకి వెళతారని కొందరు, బీజేపీ అని కొందరు ప్రచారం చేశారు ఆయన మాత్రం ఏ పార్టీలోనూ చేరలేదు.