దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. గత కొంత కాలంగా మార్కెట్‌లో బేర్ ట్రెండ్ కొనసాగుతోంది. సోమవారం సైతం అదే ప్రభావం ఉంది. దీంతో ఉదయం మార్కెట్ ప్రారంభమైక కొద్ది సేపటి నుంచే దేశీ సూచీలు బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలు వరుసగా పాయింట్లు కోల్పోతూ నష్టాల్లోకి వెళ్లాయి.
ఈ రోజు ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్ 59,710 పాయింట్ల దగ్గర ప్రారంభమైంది. ఆ తర్వాత కొద్ది సేపటికే వరుసగా పాయింట్లు కోల్పోతూ కనిష్టంగా 59,125 దగ్గరికి పడిపోయింది. ఆ తర్వాత కొద్దిగా కోలుకుంది. ఉదయం 9:50 గంటల సమయంలో 378 పాయింట్లు నష్టపోయి 59,257 వద్ద ట్రేడవుతోంది.
మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 132 పాయింట్లు నష్టపోయి 17,632 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. నష్టాలు ఇదే తీరుగ కొనసాగితే సెన్సెక్స్ 59 వేల పాయింట్లను కాపాడుకోవడం కూడా కష్టంగా మారే అవకాశం ఉంది.
భారతీ ఎయిర్‌టెల్, ఏషియన్ పేయింట్స్, పవర్‌గ్రిడ్, ఇండస్‌ఇండ్ షేర్లు లాభాలు పొందగా రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ బ్యాంక్, మారుతి సుజూకి షేర్లు నష్టాలు చవి చూశాయి.