కేంద్ర బడ్జెట్ ఇచ్చిన బూస్ట్‌తో దేశీ సూచీలు లాభాల బాట పట్టాయి. బడ్జెట్లో ఇన్‌ఫ్రాకి పెద్ద పీట వేయడంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఆసక్తి చూపించారు. దీంతో వరుసగా రెండో రోజు దేశీ సూచీలు లాభాల్లో కదలాడుతున్నాయి.
ఈ రోజు ఉదయం 9:10 గంటలకి 430 పాయింట్లు లాభపడిన బీఎస్ఈ సెన్సెక్స్ 59,293 పాయింట్ల వద్ద కదలాడుతోంది.మరోవైపు నిఫ్టీ 129 పాయింట్లు లాభపడి 17,706 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. దేశీ సూచీలు జోరుమీద ఉండటంతో మరోసారి బీఎస్ఈ సెన్సెక్స్ 59 వేల మార్క్‌ని దాటింది.