SBI కార్డ్ మీద డైలీ విత్ డ్రా ఇకనుండి ఇరవై వేలు మాత్రమే…!

Daily Withdraw On SBI Card Is Only Twenty Thousand

భారతదేశంలో సామాన్యుల బ్యాంకు అంటే స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా అనే అంటారు. మీరు ఎవరినైనా బ్యాంకు అకౌంట్ ఎందులో ఉంది అని అడిగి చూడండి, ఖచ్చితంగా ఎస్బిఐ లోనే ఉంది అంటారు. అలాంటి బ్యాంకు, గత కొన్ని సవంత్సరాల నుండి తన ఖాతాదారుల మీద కొత్త కొత్త ఆంక్షలు విధిస్తూ, విస్మయానికి గురిచేస్తుంది. ఇప్పటికే నెలకి ఐదు విత్ డ్రాలు మాత్రమే అంటూ ఖాతాదారులు ఎటిఎం సెంటర్ లను వినియోగించడాన్ని కట్టడిచేసిన ఎస్బిఐ, ఇప్పుడు మరో కొత్త ఆంక్ష విధించింది.

atm-cards

దీని ప్రకారం, స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా లో ఖాతా కలిగివుండి, క్లాసిక్ మరియు మాస్ట్రో డెబిట్ కార్డులను వాడుతున్న వారు ఇకనుండి రోజులో ఎటిఎం నుండి విత్ డ్రా చేయాలనుకున్న సొమ్ము పరిమితిని 20 వేలు కి తగ్గించింది. ఇదివరకు ఇది 40 వేలు గా ఉండేది. ఈ కొత్త ఆంక్షలు నిన్నటి బుధవారం నుండే అమలు లోకి వచ్చాయి. ఒకవేళ మీరు ఒకరోజునా 20 వేలు కంటే ఎక్కువ విత్ డ్రా చేయాల్సి వస్తుంది అని భావిస్తే, వెంటనే మాస్టర్ కార్డు కి గానీ , వీసా కార్డు కి గానీ మీ కార్డు ని మార్చుకోండి.

pin