ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ మూవీ “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ మూవీ కోసం అభిమానులు ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా దర్శకుడు వెంకట్ ప్రభు ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో విజయ్ ను డ్యూయల్ రోల్ లో ప్రెజెంట్ చేస్తున్నారు. ఇక ఇప్పటికీ చాలా మేర షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ భారీ బిజినెస్ ను కూడా జరుపుకుంటుంది.
అయితే ఇప్పుడు విజయ్ యూఎస్ కి స్టార్ట్ అయ్యినట్టుగా తెలుస్తోంది . గోట్ లోని కొన్ని కీలక సన్నివేశాలు కోసం విజయ్ అండ్ టీం వాళ్ళు యూఎస్ వెళ్లారట. ఇక దీనితో పాటుగా విజయ్ ఆల్రెడీ సగానికి పైగా తన డబ్బింగ్ ను కూడా పూర్తి చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది . ఇక ఈ మూవీ లో విజయ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు , అలాగే ఏ జి ఎస్ స్టూడియోస్ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ ఏడాది సెప్టెంబర్ 5న పాన్ ఇండియా భాషల్లో మూవీ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.