Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలంగాణ వస్తే.. దళితుడ్ని తొలి ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు కూడా ఆ పని చేయలేదు. ఇక చేయలేరు కూడా. కానీ కనీసం దళితులకు భూపంపిణీ హామీ అయినా నిలబెట్టుకుందామన్న ఇంట్రెస్ట్ ఆయనకు లేదు. ఏదో గాల్లో హామీ ఇచ్చారే కానీ.. ఇంతవరకూ ఆచరణ మొదలుపెట్టలేదు. దీంతో జిల్లాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి.
దళితులకు మంచి చేయడానికి కేసీఆర్ లేట్ చేస్తుంటే.. మరోవైపు తెలంగాణలో దళిత వ్యతిరేక ఘటనలు టీఆర్ఎశ్ కు చెడ్డపేరు తెస్తున్నాయి. దళితులకు ఇఛ్చిన హామీలు నెరవేర్చకోగా.. దళితులపై అన్యాయంగా కేసులు పెడుతున్నారని ప్రజాసంఘాలు మొత్తుకుంటున్నాయి. తాజాగా నేరెళ్ల ఘటన ఇందుకు ఉధాహరణగా నిలిచింది. హైకోర్టు అడుగుతున్న ప్రశ్నలు కూడా కేసీఆర్ కు నిద్ర లేకుండా చేస్తున్నాయి.
నేరెళ్లలో ఎవర్నీ టార్గెట్ చేయకపోతే.. అందరి మర్మాంగాలు ఎందుకు కమలిపోయాయని, రెండు వైద్యపరీక్షల నివేదికల్లో తేడాలెందుకున్నాయని హైకోర్టు నిలీదసింది. ఇప్పుడు హైకోర్టులో ఏం చెప్పాలో తెలియక నీళ్లు నములుతున్న టీఆర్ఎస్ సర్కారు.. రేపు ప్రజాకోర్టులో ఏం చెబుతుందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఒంటెత్తు పోకడలు పోతున్న కేసీఆర్ ను.. దళితులే ముంచేస్తారని హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
మరిన్ని వార్తలు: