Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దంగల్ సినిమా దేశవిదేశాల్లో భారీ విజయం సాధించిన సినిమా. అందులో అమీర్ కూతురుగా చేసిన కాశ్మీరీ అమ్మాయి జైరా వాసిం. గుర్తుంది కదా. దంగల్ సినిమాలో కుస్తీలు పట్టిన ఈ అమ్మాయికి నిజ జీవితంలో ఓ చేదు అనుభవం ఎదురైంది. అయితే జైరా సినిమాలో లాగా ఇక్కడ తిరగబడలేదు. ఓ పోకిరి వల్ల ఇబ్బందిపడి చివరకు కన్నీరు పెడుతూ ఆ సమస్యను సోషల్ మీడియా ద్వారా బయటకు చెప్పుకుంది. దంగల్ లో వీర వనితగా నటనకు గాను జాతీయ అవార్డు అందుకున్న 17 ఏళ్ళ జైరా ఇన్ స్టాగ్రామ్ లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది.
ఢిల్లీ నుంచి ముంబై వెళ్ళడానికి జైరా విస్తార ఎయిర్లైన్స్ కి చెందిన విమానం ఎక్కింది. జైరా వెనుక సీటులో కూర్చున్న ఓ మధ్య వయస్కుడైన వ్యక్తి తన కాళ్లతో ఆమెని టచ్ చేయడానికి చూశాడట. మొత్తం రెండు గంటల ప్రయాణంలో తనను టచ్ చేయడానికి అతను ఎన్ని వేషాలు వేసింది, తనను అతను ఎంతగా ఇబ్బంది పెట్టింది జైరా వివరంగా చెప్పింది. అతని చేష్టలను సెల్ ఫోన్ కెమెరా తో చిత్రీకరించడానికి ట్రై చేసినా డిమ్ లైట్ వల్ల పెద్దగా ప్రయోజనం లేకపోయిందని జైరా చెప్పుకొచ్చింది. మొత్తంగా రెండు గంటల ఆ చేదు అనుభవాన్ని వివరిస్తూ ఆమె వీడియో ద్వారా చెబుతూ కన్నీరు పెట్టుకుంది. ఈ విషయంలో ఆమె స్పాట్ లోనే కంప్లైంట్ చేయడమో లేక చెంప పగలకొట్టడమో చేసి ఉండాల్సిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.