కూతుర్ల పట‍్ల ఓ తండ్రి దారుణం

కూతుర్ల పట‍్ల ఓ తండ్రి దారుణం

తన కూతుర్ల పట‍్ల ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. వావివరుసలు మరిచి ఇద్దరు కూతుర్లను లైంగికంగా వేధించాడు. ఏకంగా మూడు దశాబ్దాల నుండి అతను తన కూతురిని వేధింపులకు గురిచేస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది.

ఈ ఘటనపై పోలీసు అధికారి జుల్ఫికర్‌ వివరాలు తెలుపుతూ.. జోధ్‌పూర్‌లోని చౌపాస్ని హౌసింగ్ బోర్డ్ పరిధిలో కన్న తండ్రి తన ఇద‍్దరు కూతుళ్లను లైంగికంగా వేధించాడు. పెద్ద కూతురు ఆరు సంవత్సరాల వయస్సు నుంచే అతడి వల్ల లైంగిక వేధింపులకు గురైనట్టు తెలిపారు. 1993లో తనపై అత్యాచారం చేశాడని.. ఈ విషయాన్ని తన తల్లికి చెప్పినా పట్టించుకోలేదన్నారు. కాగా, బాధితురాలికి 2017లో వివాహమైంది.

దీంతో ఆమె ఇంటి నుంచి వెళ్లిపోగా.. అతడి కన్ను తన చెల్లెలిపై పడింది. తాజాగా, ఆమెను కూడా తండ్రి లైంగికంగా వేధించినట్టు ఆమె ఆరోపించింది. దీంతో తన సోదరిని రక్షించాలని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కాగా, ఆమె ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల తండ్రిపై కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్టు వెల్లడించారు.