పిల్లల కోసం డీడీ డిస్నీ

DD cartoon channel

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కార్టూన్ ఛానెళ్లకు పిల్లలు బానిసలౌతున్న నేపథ్యం, కార్టూన్ పాత్రల్ని అనుకరించబోయి ప్రమాదాలు కొనితెచ్చుకోవడం చూసి కేంద్రానికి కొత్త ఆలోచన వచ్చింది. జాతీయ ఛానెల్ డీడీ ఆధ్వర్యంలోనే డీడీ కార్టూన్ ఛానెల్ మొదలెట్టాలని యోచిస్తోంది. మరి ఈ ప్రయత్నంతో అయినా పిల్లలు ప్రమాదాల బారిన పడకుండా… ఉంటారా లేదా అనేది తేలాల్సి ఉంది.

డోరేమాన్, నోబితా, జియాన్, షిన్ చాన్ చిన్నపిల్లల ఫేవరెట్ కార్టూన్లు ఇవే. కార్టూన్ నెట్ వర్క్, డిస్నీ ఛానెళ్లకు పిల్లలు అడిక్టైపోయారు. స్కూల్ నుంచి రాగానే తిండి కూడా మానేసి మరీ కార్టూన్ షోలు చూస్తున్నారు. పిల్లలపై కార్టూన్ క్యారెక్టర్ల ప్రభావం బాగా ఉంది. ఓ పిల్లవాడు కార్టూన్ ను అనుకరిస్తూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడం కలకలం రేపింది. చికిత్స పొందుతూ పిల్లాడు మరణించడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

ఫారిన్ ఛానెళ్లే ఇలాంటి ప్రమాదాలకు కారణమౌతున్నాయని భావిస్తున్న కేంద్రం… మన సంస్కృతి, సంప్రదాయాలు, పురాణాల్ని ప్రతిబింబించేలా కార్టూన్ క్యారెక్టర్లకు రూపకల్పన చేయాలని, అందుకోసం డీడీ ఆధ్వర్యంలో కిడ్స్ ఛానెల్ ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో దూరదర్శన్ కూడా పని మొదలుపెట్టింది. మరి ఇంతా చేసి పిల్లల్లో డీడీ కిడ్స్ పాపులరౌతుందా… లేదా… అందుకోసం ఎలాంటి మార్కెటింగ్ టెక్నిక్స్ పాటిస్తారనేది ప్రశ్నార్థకమే.