చనిపోయిన ఆరునెలల తర్వాత సమాధి నుంచి బయటకు వచ్చిన బిషప్ శవం

dead body came out from grave

మధ్యప్రదేశ్ లో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకంది. ఓ క్రైస్తవ మతబోధకుడు ఆరునెలల కిందటే చనిపోతే ఆయన శవానికి దహన సంస్కారాలు నిర్వహించి పూడ్చిపెట్టారు. అయితే ఈ ఘటన జరిగి ఆరునెలల తర్వాత అకస్మాత్తుగా కొందరు బిషప్ శవాన్ని పాతిపెట్టిన స్మశానినికి చేరుకున్నారు. బిషప్ సమాధిని గుర్తించి వెంటనే తవ్వకాలు చేశారు. బిషప్ శవాన్ని బయటకు తీశారు. ఇది చూడటానికి చుట్టుపక్కల ప్రజలంతా స్మశానానికి భారీ ఎత్తున చేరుకున్నారు. ఆ సమయంలో స్మశానంలో కొందరు మహిళలు కూడా ఉన్నారు. అసలేమైందంటే గతేడాది 2018 డిసెంబర్ 14న బిషప్ థామస్ కారు ప్రమాదంలో మరణించారు. దీంతో ఆయన మృతదేహానికి అంత్యక్రియలు పూర్తిచేశారు క్రైస్తవ మిషనరీ స్మశానంలో పాతిపెట్టారు. అయితే ఈ కారు ప్రమాద ఘటనపై బిషప్ శిష్యులైన కొందరు మహిళలు అనుమానాలు లేవనెత్తారు. కారు ప్రమాద సమయంలో అందులో ఐదుగురు ఉన్నట్లు గుర్తించారు. బిషప్‌తో పాటు మరో ముగ్గురు ఫాదర్లు, ఒక డ్రైవర్ కూడా కారులో ఉన్నారు. అయితే యాక్సిడెంట్‌లో ఒక్క బిషప్ థామస్ మాత్రమే మరణించారు. మిగిలిన నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. వాళ్లకు చిన్న దెబ్బకూడా తాకలేదు సరికదా ప్రమాదానికి గురైన కారు కూడా పెద్దగా డ్యామేజ్ కాలేదు. బిషప్ మృతదేహానికి కూడా పోస్టుమార్టమ్ నిర్వహించలేదని ఆరోపించారు. దీంతో ఈ ఘటనపై తమకు అనుమానాలున్నాయని ఆరోపిస్తు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు బిషప్ మహిళా శిష్యులు. వీరి వాదనలు విన్న కోర్టు వెంటనే బిషప్ శవాన్ని వెలికితీసి పోస్టమార్టమ్ నిర్వహించాలని ఆదేశిచింది. కోర్టు ఆదేశాలతో శివపురి స్మశానానికి చేరుకున్న స్థానిక ఎమ్మార్వో, పోలీసులు, అధికారులు బిషప్ శవాన్ని బటయకు తీశారు. పోస్టుమార్టమ్ నిమిత్తం మార్చురీకి తరలించారు.