మరో వారం వరకూ రవిప్రకాష్ సేఫ్

another blow to raviprakash

ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసుల్లో నిందితుడిగా ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ బెయిల్ కేసు విచారణ మళ్లీ వాయిదా పడింది. ఈరోజు ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. నిన్న హైకోర్టులో ఈ కేసు విచారణకు రాగా నేటికి వాయిదా వేశారు. నేడు హైకోర్టులో ప్రారంభమైన రవిప్రకాశ్‌ కేసు విచారణలో ఇరు వర్గాలు తమ వాదనలు వినిపించాయి. రవిప్రకాశ్‌కు బెయిల్‌ ఇవ్వొద్దని పోలీసుల తరపు లాయర్‌ వాదనలు వినిపించారు. సాక్షులను ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉందని అందుకే బెయిల్‌ ఇవ్వద్దని హైకోర్టును కోరారు. దేవేందర్‌ అగర్వాల్‌ రిజైన్‌ లెటర్‌లో సంతకం ఫోర్జరీ చేసినట్లు ఆధారాలతో సహా హైకోర్టుకు పోలీసులు చూపించారు. సాక్షులను ప్రలోభాలకు గురిచేస్తూ వారితో జరిపిన ఫోన్‌ చాటింగ్‌ స్ర్కీన్‌షాట్స్‌ను కూడా హోకోర్టుకు సమర్పించారు. రవిప్రకాశ్‌ విచారణకు సహకరించడంలేదని పోలీసులు తెలిపారు. ఈ కేసులో లోతైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని, అందుకే రవిప్రకాశ్‌కు బెయిల్‌ ఇవ్వొద్దని పోలీసుల తరపు లాయర్‌ హైకోర్టులో వాదనలు వినిపించారు. రవిప్రకాశ్‌కు బెయిల్‌ ఇవ్వమని ఆయన తరపు న్యాయవాది హైకోర్టును కోరగా ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు కేసును వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.