మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం రంగారెడ్డి జిల్లా కేశం పేట మండలం పాపిరెడ్డిగూడ పరిధిలో ఉన్న నాగార్జున పొలంలో ఒక అజ్ఞాత వ్యక్తి మృత దేహం దొరికి నట్లు వార్తలు వస్తున్నాయి.
దొరికిన ఆ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఎముకల గూడులా ఉంది అని తెలుస్తోంది. తన పొలంలో సేంద్రియ పంటలు పండించేందుకు ఏర్పాట్లు చేసుకున్న నాగార్జున ఈ విషయం పై నిపుణులను అక్కడకుపపినట్లు తెలుస్తోంది.
అయితే నాగార్జున పంపిన ఆ వ్యక్తులకు పొలంలోకి వెళ్లిన తర్వాత ఒక ప్రాంతంలోని గదిలో కుళ్లిపోయిన మృతదేహం కనిపించినట్లు సమాచారం.
దీనితో షాక్ అయిన వారు పోలీసులకు వెంటనే నాగార్జునకు పోలీసులకు సమాచారం అందించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు వెంటనే ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టమ్ పంపినట్లు తెలుస్తోంది.
పోలీసులు ఇప్పటికే ఈ విషయమై విచారణ చేయడానికి క్లూ టీమ్ ను రంగంలోకి దింపినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ అజ్ఞాత వ్యక్తి మృతదేహం దొరకడంతో ఈ విషయం మిస్టరీగా మారి పోలీసులు ఆ పొలంలో పనిచేస్తున్న అందరినీ విచారిస్తూ అన్ని కోణాలలో తమ దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. అయితే ఈ విషయమై ఇప్పటి వరకు నాగార్జున స్పందించ లేదు అని తెలుస్తోంది..