ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో ఘోరం వెలుగు చూసింది. ప్రియుడి కోసం కట్టుకున్న భర్తనే హత్య చేసేసింది. మరొకరితో శారీరక సుఖాలు అనుభవిస్తూ… పక్కా ప్లాన్ తో భర్తను హత్య చేసేసింది. ఇలాంటి ఘటనలు నిత్యం ఎన్నో చోటుచేసుకుంటూ ఉండటం ఆందోళన కలిగించే విషయంగా పరిణమంచింది. తన అక్రమ కార్యకలాపాలకు అడ్డుగా ఉన్నాడని ఈ మధ్యే మేడ్చల్లో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన విన్నాం. ఇప్పుడు ఇలాంటి తరహాలో ఏపీలో మరొకటి వెలుగు చూసింది.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను కడతేర్చింది. దీంతో ఆమె పన్నాగాన్ని పసిగట్టిన పోలీసులు భార్యను అరెస్ట్ చేశారు.
అసలు ఏం జరిగింది అంటే… అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి మండలం ఇరగరాజుపల్లిలో వెంకటేషు, అరుణ అనే దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే.. అరుణకు అదే గ్రామానికి చెందిన కేశవ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అదికాస్తా అక్రమ సంబంధానికి దారితీసింది. ఈ విషయం భర్తకు తెలియడంతో.. వారి కాపురంలో గొడవలు ప్రారంభమయ్యాయి. అది గమనించిన భర్త.. పద్దతి మార్చుకోమని పలుమార్లు భార్యను హెచ్చరించాడు. కానీ.. ఆమె అవేం పట్టించుకోకుండా.. తన ప్రియుడితో ఎంజాయ్ చేస్తూనే ఉంది. ఇక గొడవలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. దీంతో ఎలాగైనా భర్తను అడ్డుతొలగించుకోవాలని ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. ఈ నెల 26వ తేదీన అర్ధరాత్రి భర్త గాఢ నిద్రలోకి జారుకున్న తర్వాత కొడవలితో దాడిచేసి భార్య చంపేసింది. ఆ తర్వాత అనవాళ్లు కనబడకుండా చేసి.. అక్కడి నుంచి ప్రియుడి వద్దకు వెళ్లి.. రాసలీలల్లో మునిగి పోయింది. ఆ తర్వాత మరుసటి రోజు మధ్యాహ్నం ఏం జరిగిందో తెలియనట్టుగా.. ఇంటికి వచ్చి భర్త మృతదేహాన్ని చూసి విలపించసాగింది. తన భర్తను ఎవరో హత్య చేశారని అందరినీ నమ్మించేందుకు తీవ్ర ప్రయత్నం చేసింది.