భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పాత పాల్వంచ పరిధిలోని ఒక ఇంట్లో గ్యాస్‌లీక్ చేసుకుని కుటుంబం సాముహిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. నాగ రామకృష్ణ, శ్రీలక్ష్మి దంపతులు. వీరికి సాహితి, సాహిత్య అనే ఇద్దరు పిల్లలు. నాగ రామకృష్ణ మీ సేవాలోఆపరేటర్‌గా పనిచేస్తున్నారు.అప్పుల బాధను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఈ ఘటనలో దంపతులతో సహా చిన్న కూతురు సజీవ దహనమయ్యారు.రామకృష్ణ డాడీస్ అనే ఆన్‌లైన్ యాప్‌లో పెట్టుబడి పెట్టి నష్టపోయారు. అప్పులు ఎక్కువ కావడంతో తట్లుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. మరో కూతురుని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి.. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.