అమరావతి రాజధాని విషయం లో కీలక వ్యాఖ్యలు

అమరావతి రాజధాని విషయం లో కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రెండు కులాల మధ్య ఘర్షణ లాగ తయారయ్యాయని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే రాష్ట్రంలో ఇలాంటి సంస్కృతి మారాలంటే యువత రాజకీయాల్లోకి తప్పనిసరిగా రావాలంటూ పవన్ పిలుపునిచ్చారు. జనసేన శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేసిన పవన్ కళ్యాణ్ పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. కుల రాజకీయాలు మారాలంటే సరికొత్త వ్యవస్థ ఏర్పాటు చేయాలనీ, అది ఒక్క జనసేన తో మాత్రమే సాధ్యమవుతుందని పవన్ వ్యాఖ్యానించారు.

అయితే పవన్ అమరావతి రాజధాని విషయం లో కీలక వ్యాఖ్యలు చేసారు. రాజధాని కోసం 33 వేల ఎకరాలు అవసరమా? అని ఆనాడే ప్రశ్నించా అని గుర్తు చేసారు. అయితే కక్ష రాజకీయాల సాధింపు చర్యల వల్ల అంతిమంగా ప్రజలే నష్టపోతున్నారని పవన్ అన్నారు. పార్టీ న్యాయ విభాగంలో మాట్లాడిన పవన్ పలు కీలక వ్యాఖ్యలు చేసారు. జనసేనను బతికించింది సామాన్యుడేనని,వారికీ కవచంలా న్యాయ విభాగం పని చేయాలని అన్నారు. న్యాయ వాదుల నుండి బలమైన నేతలు రావాలనీ అన్నారు. పార్టీకి అండగా ఉన్నవారి ఫై అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. రాజకీయాలు రిటైర్మెంట్ ప్లాన్ కాదని, ప్రజలకు సేవ చేయడానికే వచ్చానని, జనసేన పార్టీ ని, ఏ పార్టీలో విలీనం చేసే ప్రసక్తి లేదని పవన్ అన్నారు.