చంద్రబాబుపై పెద్ద ఎత్తున పలు ఆరోపణలు

చంద్రబాబుపై పెద్ద ఎత్తున పలు ఆరోపణలు

వైసీపీ పార్టీ కీలక నేత ఐనటువంటి విజయసాయి రెడ్డి మరియు వారి పార్టీకు చెందిన ఇతర శ్రేణులు టీడీపీ అధినేత మరియు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై పెద్ద ఎత్తున పలు ఆరోపణలు చేస్తున్నారు.చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు అయినటువంటి పలువురిపై జరిగిన ఆకస్మిక ఐటీ దాడులును ఉద్దేశించి గత కొన్ని రోజుల నుంచి వీరు కొన్ని సంచలన ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.నిజానికి ఈ దాడులలో అధిక మొత్తంలో డబ్బులు దొరకాయో లేదో కానీ జగన్ మీడియాలో మాత్రం బాబును ఒక అవినీతి భూతంగా చిత్రీకరించేసారు.

ఈ వార్తలను టీడీపీ శ్రేణులు తిప్పి కొట్టినా వైసీపీ నేతల వైఖరి మాత్రం ఏమాత్రం మార్చుకోలేదు.అందులోనూ విజయసాయి రెడ్డి అయితే మరీనూ..బాబు దగ్గర నిజంగానే అంత అక్రమాస్తులు ఉన్నాయో లేదో కానీ తన మాటల్లోని డోస్ ను మాత్రం ఆయన ఎక్కడా తగ్గించడం లేదు.దీనితో వీరి మీద వాళ్ళు వారి మీద వీళ్ళు చేసుకుంటున్న ఆరోపణలు చూసి నెటిజన్లు బాగా విసుగెత్తిపోయారు.దీనితో ఎంతసేపు ఇలా బురద జల్లడమేనా లేక వారిపై ఏమన్నా చర్యలు తీసుకోడం ఉందా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పుడు తాజాగా విజయసాయి రెడ్డి పెట్టిన ఓ ట్వీటుకు నెటిజన్లు అలాగే ఫైరవుతున్నారు.ప్రభుత్వంలో ఉన్నది మీరే కదా ఏదోకటి చెయ్యండి,కనీసం వారిపై కేసు అయినా ఫైల్ చెయ్యండి ఎంత సేపు ఇలా సోషల్ మీడియాలో వాగడమేనా అంటూ లాజికల్ గా ప్రశ్నిస్తున్నారు.నిజంగానే చంద్రబాబు అవినీతి చేసి ఉంటే వీరెందుకు చర్యలు తీసుకోడం లేదో మరి?లేకపోతే నిజంగానే ఈ రెండు పార్టీల నేతలు ఇలా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కాలయాపన చేసి వారిలో వారినే కాపాడుకుంటున్నారా.?