నష్టాన్ని మిగిల్చిన జాను చిత్రం

నష్టాన్ని మిగిల్చిన జాను చిత్రం

దిల్ రాజు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో పింక్ రీమేక్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే తాజాగా విడుదల అయినా జాను చిత్రం బాక్సఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. తమిళ 96 చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన జాను చిత్రం ఘోర కలెక్షన్లతో బయ్యర్లకు నష్టాన్ని మిగిల్చింది. అయితే ఈ చిత్రాన్ని నిర్మించిన దిల్ రాజు ప్రస్తుతం సందిగ్ధంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. దిల్ రాజు రీమేక్ చిత్రాలతో గతంలో భారీ విజయాల్ని నమోదు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం జాను చిత్రం ఇచ్చిన ఫలితం పింక్ రీమేక్ ఫై పడే అవకాశం ఉన్నట్లుగా భావిస్తున్నట్లు సమాచారం.

పవన్ కళ్యాణ్ రీఎంట్రీ కాస్త పింక్ రీమేక్ తో ఇస్తున్నారు. ఇది కూడా హిందీ, తమిళ్ లో భారీ విజయాల్ని నమోదు చేసుకుంది. అయితే ఈ చిత్రం ఫుల్ లెంగ్త్ చాల సీరియస్ కథనం తో, కథ తో ఒక జోనర్ కి మాత్రమే పరిమితం అయ్యే అవకాశం ఉందని పలువురు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే దిల్ రాజు ఇప్పటికే ఈ చిత్రం ఫై భారీగా ఖర్చు చేసారు. మరి పింక్ రీమేక్ ఎలాంటి ఫలితాన్నిస్తుంది అనేది ప్రస్తుతం నిర్మాత దిల్ రాజుని కలవర పెడుతున్న అంశం.