అసెంబ్లీ లో రాజధాని ఫై ముఖ్య ప్రకటన

అసెంబ్లీ లో రాజధాని ఫై ముఖ్య ప్రకటన

అమరావతి జేఏసీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అమరావతిని ప్రభుత్వం తరలించేందుకు ప్రయత్నిస్తుంది అని వ్యతిరేక చర్యగా అసెంబ్లీ ని ముట్టడించనున్నారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. చట్టాలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని దానికి అనుగుణంగా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీస్ శాఖని అప్రమత్తం చేసి ముందస్తు చర్యలు తీసుకుంటుంది.

అయితే రేపు క్యాబినెట్ మీటింగ్ నిర్వహించి అసెంబ్లీ లో రాజధాని ఫై ముఖ్య ప్రకటన వెలువడే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. ఇప్పటివరకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ఒక్కొక్కటిగా అమలవుతున్న సందర్భంలో ఈ రాజధాని వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే అవకాశం వుంది. జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ ఇచ్చిన నివేదికల్ని హైపవర్ కమిటీ పరిశీలించి ఒక నివేదిక ని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ ముఖ్యంశాలుగా ఈ నివేదిక లో పలు అంశాలని వివరించినట్లు తెలుస్తుంది. అయితే క్యాబినెట్ మీటింగ్ లో జగన్ కి నివేదిక లో విషయాలతో పాటుగా జీఎన్ రావు, బీసీజీ, నిపుణుల నివేదికల్లోని విషయాలన్నింటిని వివరించిన తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేయనున్నారు. ఉత్కంఠ రేపుతున్న ఈ రాజధాని అంశం ఫై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు.