Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కమెడియన్ ధన్‌రాజ్ ఒక కామాంధుడు అంటూ తాజాగా బిగ్‌బాస్ నుండి ఎలిమినేట్ అయిన దీక్షా పంథ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ధన్‌రాజ్ హీరోగా నటించి నిర్మించిన ‘ధనలక్ష్మి తలుపు తడితే’ అనే చిత్రంలో దీక్షా పంథ్ హీరోయిన్గా నటించిన విషయం తెల్సిందే. ఆ సమయంలో షూటింగ్ లేకున్నా కూడా తరచు నాతో మాట్లాడేందుకు ప్రయత్నించేవాడు, ఎక్కువగా నాతో ఉండాలని ధన్‌రాజ్ అనుకుంటూ ఉండేవాడు. ప్రత్యేకంగా కలుద్దామని అంటూ ఉండేవాడని చెప్పుకొచ్చింది. కాని నేను ఎప్పుడు కూడా ఆయనకు ఛాన్స్ ఇవ్వలేదు. ఆ కోపాన్ని బిగ్‌బాస్ షోలో చూపించాడు అంటూ ధన్రాజ్పై సంచలన ఆరోపణలు చేసింది.
బిగ్‌బాస్ షోలో నుండి ఎలిమినేట్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా మీడియా ముందుకు రావడం తెగ ఇంటర్వ్యూలు ఇచ్చేయడం జరుగుతుంది. అదే విధంగా ఎలిమినేట్ అయ్యిందో లేదో వెంటనే పలు ఛానల్స్‌కు దీక్షా పంథ్ ఇంటర్వ్యూలు ఇస్తూ వచ్చింది. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ధన్రాజ్పై పై వ్యాఖ్యలు చేయడం జరిగింది. ధన్‌రాజ్ అంటే తనకు మొదటి నుండి కూడా ఇష్టం లేదని, బిగ్‌బాస్ ఇంట్లో తనను పదే పదే ఇబ్బంది పెట్టేవాడని, ఇంటి సభ్యులతో కలిసి నన్ను టార్గెట్ చేసేవాడు అంటూ ధన్‌రాజ్‌ను తిట్టిపోసింది. ఇప్పటి వరకు ధన్రాజ్పై ఇలాంటి ఆరోపణలు వచ్చింది లేదు. మొదటి సారి ధన్‌రాజ్‌ను ఒక హీరోయిన్ ఇలాంటి ఆరోపణలతో అతడి కెరీర్‌పైనే దెబ్బ కొట్టే ప్రయత్నం చేసింది. అయితే ఈ వ్యాఖ్యలపై ధన్‌రాజ్ ఎలా రియాక్ట్ అవుతాడు అనేది చూడాలి.