రొమెంటిక్ లైఫ్… తీపి ప్రతీకారాలతో .. దీపికా రణ్ వీర్

దేశంలో కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఈ మహమ్మారి ప్రజలందరినీ హడలెత్తిస్తోంది. కరోనావైరస్ కారణంగా స్వీయ గృహ నిర్బంధంలో ఉన్న దీపికా పదుకోన్, రణ్‌వీర్ సింగ్ కపుల్ రొమాంటిక్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఒకరిపై మరోకరు చిలిపిగా సెటైర్లు విసురుకుంటున్నారు. ఓసారి రణ్‌వీర్‌ను దీపిక ఆటపట్టిస్తే.. మరోసారి దీపికను రణ్‌వీర్ ఆటపట్టిస్తూ… దొరకిన టైంను ఎంజాయ్ చేస్తున్నారు. ఇంట్లో చేసే ఆ చిలిపి చేష్టలను తమ ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ఫ్యాన్స్ ఫిదా చేస్తున్నారు. తాజా ఎపిసోడ్ లో దీపికపై రణ్‌వీర్ ప్రతీకారం తీర్చుకొన్నాడు.

ఎలా అంటే… రణ్‌వీర్‌పై దీపిక ఫిర్యాదు..

పెళ్లి తర్వాత పూర్తిస్థాయిలో కలిసి ఉంటున్న దీపికా, రణ్‌వీర్‌లకు కరోనా వైరస్ మరింత దగ్గరకు చేర్చింది. లాక్‌డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన రణ్‌వీర్‌పై కాస్త ఫిర్యాదు కూడా చేసింది. రోజులో రణ్ వీర్ సుమారు 20గంటలు నిద్రపోతున్నాడు. కేవలం 4గంటలే మెలుకువలో ఉంటున్నాడు అని చెప్పింది. 21 రోజుల లాక్‌డౌన్ కారణంగా దీపికా పదుకోనే స్వచ్ఛమైన గృహిణిగా మారిపోయింది. ఇంటిలోని వస్తువులను చక్కగా సర్దుకుంటూ కాలాన్ని ఎంజాయ్ చేస్తుంది. ఇంటిలోని నిత్యావసర వస్తువుల డబ్బాలపై వాటి పేర్లు రాస్తూ లేబుల్స్ అంటిస్తుంది.

అంతేకాకుండా నిద్రలో ఉన్న రణ్‌వీర్ సింగ్ తలపై భర్త (husband) అనే స్టిక్కర్‌ను అంటించింది. రణ్‌వీర్ తలపై ఉన్న స్టిక్కర్ ఫోటోను తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేసి.. కాలాన్ని చాలా చక్కా యూజ్ చేసుకొంటున్నారు అంటూ కామెంట్ చేసింది. ఆ ఫోటోకు ఇన్స్‌టాగ్రామ్‌లో విశేషాదరణ లభిస్తుంది. తన ఫోటోను అలా బహిరంగ పరచడంపై అసంతృప్తికి గురైన రణ్‌వీర్ సరైన సమయం కోసం ఎదురు చూశాడు. అర్ధరాత్రి దీపిక దొంగచాటుగా చేసిన పనిని కెమెరాలో బంధించి తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. దీపిక అర్ధరాత్రి ఖిల్జి అనే న్యూట్రిషన్ ఫుడ్‌ను స్పూన్‌లో తీసుకొని నాకడం చూసి దానిని కెమెరాలో బంధించాడు. చడీ.. చప్పుడు లేకుండా… దొంగచాటుగా ఇంట్లో అర్ధరాత్రి ఆ పని ఏంటి..? అంటూ రణ్‌వీర్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఇది నా స్వీట్ రివేంజ్ అంటూ దీపికాకు.. రణ్ వీర్ గట్టి షాకే ఇచ్చాడు.