క్రికెట్ అభిమానులకు చేదు వార్త: డక్‌వర్త్‌ లూయిస్‌ సూత్రధారి లూయిస్‌ మృతి

ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన క్రీడ క్రికెట్. క్రికెట్ అభిమానులకు ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్ టోనీ లూయిస్ అంటే తెలియని వారు ఉండరు.తెలియని వారి కోసం ఓ విషయాన్ని గుర్తు చేస్తా.. అదేమంటే.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో డక్‌వర్త్‌ లూయిస్‌ (డీఎల్‌ఎస్‌) పద్ధతి అంటే తెలియని వారు ఉండరు. క్రికెట్‌లో ఎప్పుడూ ఉపయోగించే డీఎల్‌ఎస్‌ సూత్రధారుల్లో టోనీ లూయిస్‌ ఒకరు. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అయినా… సరే మ్యాచ్ ఆగిపోతే ఈ డీఎల్‌ఎస్‌నే అనుసరించి విజేతను ప్రకటిస్తారు. వర్షం కారణంగా అర్దాంతరంగా మ్యాచ్ లు ఆగిపోతే విజేతను తేల్చే పద్ధతిని కనిపెట్టిన గణాంక నిపుణుల్లో ఒకరైన లూయిస్‌ ఇకలేరు అన్న వార్త క్రికెట్ ప్రియులను విషాదంలోకి ముంచుంది.

లూయిస్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 78 ఏళ్ల టోనీ లూయిస్‌ బుధవారం మృతి చెందినట్లు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) ఒక ప్రకటనలో తెలిపింది. ‘లూయిస్‌ మృతి చెందారని చెప్పడానికి విచారిస్తున్నాం. ఫ్రాంక్‌ డక్‌వర్త్‌తో కలిసి 1997లో ఆయన డక్‌వర్త్‌-లూయిస్‌ విధానాన్ని సృష్టించారు. 1999లో ఐసీసీ ఆ విధానాన్ని అధికారికంగా అమల్లోకి తెచ్చింది’ అని ఇంగ్లాండ్‌ బోర్డు వివిరించింది. ఇదే సమయంలో క్రికెట్‌కు లూయిస్‌ ఎంతో సేవ చేశారని ఐసీసీ జనరల్‌ మేనేజర్‌ జెఫ్‌ అలార్దిస్‌ అన్నాడు.కాగా డక్‌వర్త్‌.. లూయిస్‌ల రిటైర్మెంట్‌తో స్టీవెన్‌ స్టెర్న్‌.. డక్‌వర్త్‌ లూయిస్‌ విధానాన్ని చూసుకుంటున్నాడు. దీంతో దాని పేరును ఐసీసీ.. ‘డక్‌వర్త్‌ లూయిస్‌-స్టెర్న్‌’గా మార్చింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతికి ఐసీసీ 1999లో ఆమోద ముద్ర వేసింది. అయితే ఈ పద్ధతి మాత్రం 2004 నుంచి అందుబాటులోకి రావడం విశేషం. ఎలాంటి పరిస్థితుల్లోనైవా క్రికెట్ మ్యాచ్‌లు అర్థాంతరంగా ఆగిపోతే.. డక్‌వర్త్ లూయిస్ పద్ధతితో విజేతను డిసైడ్ చేస్తారు.