దేశమంతా ఇంట్లో… ఆ కంపెనీ మాత్రం అడ్డంగా దొరికింది

కరోనా వైరస్‌తో దేశమంతా అల్లల్లాడుతుంది. అందుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లను చేసుకుంటూ తగ్గించే ప్రయత్నాలను దార్లను వెతక్కుంటూ ముమ్మరంగా ప్రజలందరినీ ఇంటికే పరిమితం చేసింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇంటి గడప దాటడం లేదు.

ముఖ్యంగా తెలంగాణలో ఏప్రిల్ 14వరకు లాక్ డౌన్ ఉండగా.. రాత్రి 7గంటల నుంచి ఉదయం 6గంటల వరకు కర్ప్యూ అమల్లో ఉంది. కానీ కొన్ని సంస్ధలు మాత్రం యధేచ్చగా నడస్తున్నాయి. సీఎం కేసీఆర్ మాటలను ఏమాత్రం లెక్కచేయడం లేదు. తాజాగా వికారాబాద్ జిల్లాలో జరిగిన ఘటనే అంతదుకు అద్దంపడుతోంది. వికారాబాద్ జిల్లా శివారెడ్డిపేటలో ఉన్న సంగమేశ్వర ఎంటర్ ప్రైజెస్ పేరుతో పేపర్ ప్లేట్ ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ లాక్ డౌన్ సమయంలో యథేశ్చగా సాగుతుంది. అది సాగటం అట్లా ఉంటి మైనర్లతో పనులు సాగించేస్తున్నారు. విషయం తెలిసుకున్న ఓ స్వచ్చంద సంస్థ.. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులకు సమాచారం అందించారు.

కాగా ఎన్జీవో సంస్థ ప్రతినిధులు కరోనా వైరస్ పై అవగాహన కల్పించే సమయంలో పనిచేస్తున్నారని తెలిసి.. అధికారులకు సమాచారాన్ని అందించారు. తాము ఫ్యాక్టరీ వద్దకు వచ్చినప్పుడు గేట్లు క్లోజ్ చేసి.. లోపల పనిచేస్తున్నారని ఎన్జీవో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కే కృష్ణన్ తెలిపారు. తెరచి చూడగా ఐదుగురు ఉన్నారని.. వారంతా 11 నుంచి 15 ఏళ్ల వయసు కలిగిన మైనర్లుగా గుర్తించారు. వీరు బీహర్‌కు చెందిన వలస కూలీలుగా తెలుస్తోంది. కాగా సరిగ్గా ఏడాది క్రితం వారిని ఇక్కడకు తీసుకొచ్చి.. గొడ్డు చాకిరీ చేయించుకుంటున్నారని తేలింది. యాజమాన్యంపై కార్మిక చట్టం, జువైనల్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. వికారాబాద్‌లో తాజాగా బాలలతో గొడ్డు చాకిరీ వెలుగులోకి రాగా.. ఈ మధ్య కరీంనగర్‌లో 24 మంది వలస కూలీలను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ఒడిశాకు చెందిన వారు అని అధికారులు తేల్చారు. ఇందులో ఆరుగురు చిన్నారులు ఉండగా.. తొమ్మిది మంది మహిళలు ఉండటం కలవరానికి గురిచేస్తుంది.