ఈ వేసవిలో… బీర్లు కష్టమే

కరోనా వైరస్ కారణంగా మందు ప్రియులకు వరుస చేదు వార్తలు వినాల్సి వస్తుంది. బీర్ ప్రొడక్షన్ కూడా బంద్ చేయనున్నారు. ఈ నెలాఖరు వరకు.. బీర్ ప్రియులకు చేదు వార్త అనే చెప్పాలి. బీర్లలో కరోనా బ్రాండ్ వాడే మందుప్రియుల నోటిలో వెలక్కాయ పడింది. మెక్సికోలో క్రమంగా కరోనా బీర్ ఉత్పత్తిని తగ్గిస్తున్నామని తెలిపింది. దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్న విషయం తెలిసిందే.  ఏకంగా 1500 మందికి కరోనా వైరస్ సోకగా.. 50 మంది మృత్యువాత పడ్డారు. మెక్సికో ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా బీర్ ఉత్పత్తి తగ్గిస్తున్నామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

అదేవిధంగా ఫసిఫిక్.. మెడెలో బ్రాండ్లు ఉన్న గ్రూపో మోడె కంపెనీ మెక్సికోలో కరోనా బీర్లను తయారు చేస్తోంది. దేశంలో వైరస్ వేగంగా ప్రబలుతోన్న ఈ సమయంలో బీర్ ఉత్పత్తి నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించంతో నిలిపి వేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఏప్రిల్ 30వరకు ఉత్పత్తి నిలిచి పోతుందని స్పష్టం చేసింది. ఇప్పటికే ఫ్యాక్టరీలో ఉత్పత్తిని క్రమంగా తగ్గించామని.. దానిని కనీస స్థాయికి తగ్గించే పనిలో ఉన్నామని స్పష్టం చేసింది.

అంతేకాకుండా దేశంలో పరిస్థితి దృష్ట్యా.. వ్యవసాయ ఉత్పత్తులకు మాత్రమే అనుమతి ఇస్తున్నామని.. మెక్సికో ప్రభుత్వం పేర్కొన్నది. ఇతర ఉత్పత్తులపై మాత్రం ఆంక్షలు అమలవుతున్నాయని.. ప్రభుత్వం తమకు అనుమతులు ఇస్తే 75 శాతం సిబ్బందితో పూర్తి ఉత్పత్తి చేసేందుకు రెడీగా ఉన్నామని కంపెనీ తెలిపింది. కరోనా కాదు హీనెకెన్ కూడా తమ బీర్ల ఉత్పత్తిని ఆపివేసిందని స్థానిక పత్రిక వెల్లడించింది. బీర్ల ఉత్పత్తిని నిలిపివేయడంపై ఆయా కంపెనీలు తప్పు పడుతున్నాయి. కాగా కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత బీర్‌పై జోకులు పేల్చారు. మీమ్స్ కూడా వచ్చాయి. ఇతర పుకార్లతో అమెరికాలో కరోనా బీర్ల విక్రయాలు 40 శాతం మేర తగ్గాయి.