బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్ నటించిన ‘ఓం శాంతి ఓం’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. తొలి సినిమాతోనే గ్రాండ్ సక్సెస్‌ను అందుకుంది దీపికా పదుకొనే. కెరీర్ ఆరంభంలో కేవలం గ్లామరస్ రోల్స్‌కి మాత్రమే పరిమితమైన ఈ భామ.. ఆ తర్వాత సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన రామ్ లీలా, భాజీరావ్ మస్తానీ, పద్మావత్ వంటి చిత్రాల్లో నటించి.. అందరి మెప్పు పొందింది. ఇక బాలీవుడ్‌తో పాటు.. హాలీవుడ్‌లోనూ ఓ సినిమాలో నటించింది ఈ సుందరి.
అయితే సినిమాల ఎంపికలో దీపికా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. తనకున్న ఇమేజీకి తగినట్లుగా ఆమె పాత్రలను ఎంపిక చేసుకుంటుంది. గత ఏడాది యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితగాధ ఆధారంగా తెరకెక్కిన ‘ఛపాక్’ అనే సినిమాలో దీపికా అద్భుతంగా నటించింది. ఇక తన భర్త రణ్‌వీర్ సింగ్ నటిస్తున్న టీం ఇండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ బయోపిక్‌లోనూ ఆమె ఓ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇక హాలీవుడ్‌లో ‘ట్రిపుల్ఎక్స్’ సినిమాతో అడుగుపెట్టిన ఆమె.. ఇప్పుడు మరో సినిమాను కూడా హాలీవుడ్‌లో చేసేందుకు రెడీ అయిందట.
రొమాంటిక్ కామెడీగా రూపొందే ఈ చిత్రాన్ని ఎస్టీఎక్స్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. టెంపుల్ హిల్ ప్రొడక్షన్స్ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామి అవుతోంది. మరో విశేషం ఏమిటంటే, కథానాయిక దీపిక ఇందులో నటించడమే కాకుండా, తాను కూడా ఓ నిర్మాతగా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం తీసుకుంటోంది. ఈ విషయాన్ని ఎన్టీఎక్స్ ఫిలిమ్స్ సంస్థ అధినేత ఆడమ్ ఫోజిల్సన్ ట్వీట్ చేశారు. దీపికా వంటి అంతర్జాతీయ స్టార్‌తో కలిసి పని చేయడం ఎంతో సంతోషంగా ఉంది అని ఆయన పేర్కొన్నారు. తన ప్రొడక్షన్ సంస్థ ‘కా ప్రొడక్షన్స్’.. ‘ఎన్టీఎక్స్ ఫిలిమ్స్‌తో కలిసి పని చేయడం గర్వకారణం అంటూ దీపికా కూడా పేర్కొంది.