బాలీవుడ్‌లో డ్రగ్ కేసు కలకలం రేపుతోంది. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుతో వెలుగు చూసిన ఈ డ్రగ్ కేసులో రోజు రోజుకు ఆసక్తిగా మారుతోంది. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణలో రోజు రోజుకు పలువురు బాలీవుడ్ ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో సారా అలీ ఖాన్, రకుల్ ప్రిత్ సింగ్‌లకు ఎన్‌సీబీ ఇప్పటికే సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న(సోమవారం) బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె పేరు బయటకు వచ్చింది. కె అనే వ్యక్తితో దీపికా మాల్ ఉందా అంటూ చేసిన చాట్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక అది తెలిసి బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ దీపికాపై విమర్శలు గుప్పించారు. గతంలో దీపికా డిప్రెషన్‌కు లోననై విషయం తెలిసిందే.
దానిని ఉద్దేశిస్తూ కంగనా ‘డ్రగ్స్ వాడకం ఫలితమే డిప్రెషన్. క్లాస్‌గా కనిపించే కొందరూ స్టార్‌ల పిల్లలు వారి మేనేజర్లతో మాల్ గురించి అడుగుతుంటారు’ అని చురకలంటించారు. బాలీవుడ్ డ్రగ్స్ వాడే వాళ్లతో పాటు దీపికాను బాయ్‌కాట్ చేయాలంటూ ఆమె హ్యాష్ ట్యాగ్ జత చేశారు. కె అనే వ్యక్తి దీపికా మేనేజర్ కరిష్మా ప్రకాష్‌గా అభిప్రాయ పడుతున్నారు. అయితే ఇప్పటికే ఈ డ్రగ్ కేసులో నేరారోపణ రుజువు కావడంతో సుశాంత్ ప్రియురాలు రియ చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తితో పాటు పలువురి ఎన్‌సీబీ అరెస్టు చేసి జైలు తరలిచింది. విచారణలో రియా బాలీవుడ్‌కు చెందిన 25 మంది ప్రముఖుల పేర్లను, డ్రగ్స్ వాడే పార్టీ ల జాబితాను ఎన్‌సీబీకి వెల్లడిచింది. ఈ క్రమంలో సారా, రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్దా కపూర్, దీపికాలకు కూడా సంబంధం ఉన్నట్లు ఎన్‌సీబీ గుర్తించింది.