దీపికాపడుకోణె గతఏడాదిలో నటుడు రన్వీర్ సింగ్ ని వివాహం చేసుకుంది.బెంగుళూరులోని సోఫియా ఉన్నత పాఠశాలలో చదువు పూర్తిచేసుకుని,మౌంట్ కార్మెల్ కాలేజీలో ప్రీయూనివర్సిటీ కోర్సు చదువు పూర్తి చేసింది.తన తండ్రిలానే రాష్ట్రస్థాయిలో చిన్నపుడు బ్యాడ్మింటన్ఆడి తర్వాత నటిగా బాలీవుడ్లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది.
ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో దీపికాపడుకోణె చిన్నప్పటి ప్రోగ్రెస్ కార్డ్ ఫొటోను ఒకదాన్ని షేర్ చేశారు.ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్లో”చెప్పినమాట దీపికా సరిగ్గావినదు”అని టీచర్‌రాసిన కంప్లయింట్ ఉంది.దానిని ఉద్దేశిస్తూ కామెంట్ రూపంలో అవునుటీచర్..మీరు కరెక్ట్ గా చెప్పారని రణ్‌వీర్‌సింగ్ అన్నారు.ఈ కామెంట్ కి బదులుగా “ఇవాళ రాత్రి నీకు డిన్నర్‌కట్”అంటూ దీపికా కామెంట్ చేశారు.మామూలుగానే భార్యాభర్తల వాక్ వివాదం జరిగినప్పుడు‘ఇవాళ మీకు భోజనంకట్’అనే డైలాగ్ వింటూ ఉంటాము.ఇప్పుడు రణ్‌వీర్ సింగ్‌ను ఉద్దేశిస్తూ దీపికా కూడా ఈ డైలాగ్ కొట్టారు.