ఆ పోస్ట్ పై దీపికా పదుకొణె షాకింగ్ కామెంట్స్ … !

Deepika Padukone's shocking comments on that post...!
Deepika Padukone's shocking comments on that post...!

ఎల్ అండ్ టీ కంపెనీ చైర్మన్ ఎస్ ఎన్ సుబ్రమణియన్ ఉద్యోగుల పని సమయానికి సంబంధించి.. ఉద్యోగులు వారానికి 90 గంటలు పని చేయాలని, ఆదివారాల్లోనూ ఆఫీస్‌ కి రావాలని ఆయన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే . పైగా సుబ్రమణియన్ ఉద్యోగుల పై వెటకారంగా ‘ఎప్పుడూ ఇంట్లో ఉంటూ ఏం చేస్తారు ? ఎంతసేపు భార్య ముఖం చూస్తూ ఉంటారు ?’ అంటూ కొంచెం వ్యంగ్యంగా మాట్లాడారు. దీంతో, సుబ్రమణియన్ పై నెటిజన్లు విరుచుకు పడుతున్నారు. సుబ్రమణియన్ వ్యాఖ్యలని తప్పుపడుతున్నారు.

Deepika Padukone's shocking comments on that post...!
Deepika Padukone’s shocking comments on that post…!

ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె కూడా సుబ్రమణియన్‌ కామెంట్స్ ప్రకటన పై స్పందిస్తూ.. అసంతృప్తిని వ్యక్తం చేసింది. ‘ఇంత ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి ప్రకటన చేయడం తనకి చాలా షాక్ గా ఉంది’ అని తన ఇన్ స్టా స్టోరీస్‌ లో దీపికా పదుకొణె ఒక పోస్ట్ పెట్టింది. పైగా ఆమె తన పోస్ట్ కి #mentalhealthmatters అనే హ్యాష్‌ట్యాగ్‌ని కూడా జోడించింది. మొత్తానికి ఎస్ ఎన్ సుబ్రమణియన్ కి మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమని అర్ధం వచ్చేలా దీపికా పదుకొణె పోస్ట్ పెట్టడం విశేషం.