బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకొనే కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో దీపికా త్వరగా కోలుకోవాలంటూ అమె అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఈ వార్తను దీపిక ఇంకా ధృవీకరించలేదు. కానీ ఇప్పటికే దీపికా కుటుంబం కరోనాతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. గత నెలలో దీపికా భర్త రణవీర్‌తో కలిసి బెంగళూరుకు వెళ్లినట్టు తెలుస్తోంది.
తల్లిదండ్రులు, సోదరి కరోనా సోకింది. దీపికా తండ్రి , ప్రముఖ క్రీడాకారుడు ప్రకాష్ పడుకొనే బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనతోపాటు దీపికా తల్లి ఉజ్జల, సోదరి అనీషాకు కూడా పాజిటివ్ వచ్చింది. వీరిద్దరూ హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇటీవలే ప్రకాష్ వ్యాక్సిన్ మొదటి డోసును స్వీకరించారు. అయితే ప్రకాష్ పదుకొనే ఆరోగ్యం నిలకగానే ఉందని, మరో రెండో రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని ప్రకాష్ పడుకొనే బ్యాడ్మింటన్ అకాడమీ డైరెక్టర్ విమల్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.